: రేవంత్ ఎక్కడున్నారో తెలియడంలేదు... ఏసీబీ తీరు సరికాదు: న్యాయవాదుల ఆందోళన
ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసీబీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, రేవంత్ ను ఆయన న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని కోర్టు ఏసీబీకి స్పష్టం చేసింది. అయితే, ఏసీబీ అధికారులు ఈ ఉదయం రేవంత్ ను అదుపులోకి తీసుకున్నారని, దీనిపై తమకు ఎలాంటి సమాచారం అందించలేదని రేవంత్ న్యాయవాదులు నిరసనకు దిగారు. హైదరాబాదు ఏసీబీ కార్యాలయం ఎదుట వారు ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డిని ఎక్కడికి తరలించారో చెప్పాలని డిమాండ్ చేశారు.