: నెలల తరబడి కష్టించి 'మ్యాగీ'ని పడితే... ఆ క్రెడిట్ కొట్టేశారని వాపోతున్న జూనియర్ అధికారి


నెస్లే మార్కెటింగ్ చేస్తున్న మ్యాగీ నూడుల్స్ విషయంలో కొనసాగుతున్న వివాదం అందరికీ తెలిసిందే. అసలు మ్యాగీలో విష పదార్థాలు ఉన్నాయని మొట్టమొదటిసారిగా బయటకు చెప్పిందెవరు? మనకు తెలిసిన సమాధానం ఉత్తరప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు. ఇదే విభాగంలో పనిచేస్తున్న ఓ జూనియర్ స్థాయి అధికారి, తాను నెలల తరబడి కష్టపడి 'మ్యాగీ' వెంటపడి, శాంపిల్స్ తీసి పరీక్షలు జరిపితే, ఆ క్రెడిట్ తనకు దక్కకుండా చేశారని వాపోయారు. 1998 బ్యాచ్ ఫుడ్ ఇనస్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు సంజయ్ సింగ్. ఈ ఇన్ స్టంట్ ఫుడ్ జెయింట్ దిగ్గజం వెనకున్న చీకటి కోణాన్ని శ్రమించి వెలికితీస్తే, తన బాస్ వీకే పాండే ఎక్కడా తన పేరు చెప్పలేదని ఆరోపించాడు. తన విధుల్లో భాగంగా జరిపిన పరీక్షలు వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని దెబ్బతీస్తాయని అసలు అనుకోనేలేదని అంటున్నారు సంజయ్ సింగ్. "సంస్థలోని ప్రతి ఉద్యోగికీ ఒక్కో బాధ్యతను అప్పగిస్తాం. సంజయ్ కి కేటాయించిన పనిలో భాగంగా, శాంపిల్స్ సేకరించాడు. ఆపై చర్యలు చేపట్టింది నేనేకదా?" అని బారాబంకీ లోని ఫుడ్ సేఫ్టీ విభాగం హెడ్ పాండే అంటున్నారు. అయితే, తానీ కేసును సంవత్సరం నుంచి ఫాలో అప్ చేస్తున్నానని, ఎన్నడూ పై అధికారులు తనకు మద్దతివ్వలేదని ఆరోపిస్తున్నారు సంజయ్.

  • Loading...

More Telugu News