: ఢాకా చేరుకున్న మోదీ... స్వాగతం పలికిన బంగ్లా ప్రధాని
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢాకా చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మోదీకి సాదర స్వాగతం పలికారు. ఈ సాయంత్రం మోదీ, హసీనాలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ పర్యటనలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానంగా చర్చిస్తారు. అంతేగాక పర్యటన సందర్భంగా మాజీ ప్రధాని ఏబీ వాజ్ పేయీ తరపున విముక్తి యుద్ధం పురస్కారాన్ని మోదీ స్వీకరిస్తారు.