: ఏపీ చరిత్రలో అపూర్వ ఘట్టం... ఓ మహత్తర కార్యానికి తొలి అడుగు పడింది


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఓ అపూర్వ ఘట్టానికి తెరలేచింది. అమరావతి నగర నిర్మాణానికి తొలి అడుగు పడింది. సరిగ్గా 8 గంటలా 49 నిమిషాలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి శాస్త్రోక్తంగా నవ్యాంధ్ర రాజధాని భూమిపూజ చేశారు. అంతకుముందు హెలికాప్టర్ లో గన్నవరం నుంచి మందడం చేరుకున్న ఆయనకు పండితులు వేదమంత్రాలతో ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ రీతిలో తెల్లని పంచ, మెడలో ఎరుపురంగు ఉత్తరీయం ధరించిన బాబు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ ప్రారంభించారు. పూజ నిమిత్తం తీసిన గుంతలోకి దిగిన చంద్రబాబు దంపతులు అక్కడ నవధాన్యాలు, బంగారం తదితరాలు ఉంచారు. బంగారు తాపీ, వెండి గమేళాలు వాడి, ఇటుకల మధ్య సిమెంట్ వేయడం ద్వారా లాంఛనాన్ని పూర్తి చేశారు. వేదపండితులు దగ్గరుండి ఆయనతో ఈ క్రతువు చేయించారు. ఈ కార్యక్రమంలో లోకేష్, కోడెల శివప్రసాద్, గంటా శ్రీనివాసరావు, గల్లా జయదేవ్, మాగంటి బాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News