: నవగ్రహ ఆరాధన, విష్వక్సేన, అష్టదిక్పాలక పూజలు పూర్తి
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం మందడం ప్రాంతంలో జరుగుతున్న భూమిపూజ అత్యంత వైభవంగా జరుగుతోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ప్రభుత్వ అధికారుల సందడి అంతగా లేకపోయినా, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుఝాము నుంచి ప్రారంభమైన పూజల్లో భాగంగా ఇప్పటివరకూ గణపతి హోమం, నవగ్రహ ఆరాధన, విష్వక్సేన, అష్టదిక్పాలక పూజలు జరిగాయి. భూమి పూజ స్థలంలో రాతి శంఖం ప్రతిష్ఠించిన తరువాత చంద్రబాబు సహా సుమారు 500 మంది రైతులు ట్రాక్టర్లను ఎక్కి భూమిని చదును చేయనున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో తరలివెళ్లేందుకు బేగంపేట చేరుకున్నారు.