: అగ్రిగోల్డ్ కు మరో షాక్... సంస్థ భూములు స్వాధీనం చేసుకోవాలని ఏపీ సర్కార్ ఆదేశం


ఖాతాదారులను నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ సంస్థకు మరో షాక్ తగిలింది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటకలోని ఆ సంస్థకు చెందిన 3,047 ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం సీఐడీని ఆదేశించింది. కాగా ఆ సంస్థ రూ.30 లక్షల మంది ఖాతాదారుల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని సీఐడీ నివేదికలో తెలిపింది. అంతేగాక ఖాతాదారులకు ఇచ్చిన రూ.700 కోట్ల విలువైన చెక్కులు కూడా బౌన్స్ అయినట్టు ప్రభుత్వానికి వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పైవిధంగా నిర్ణయించింది.

  • Loading...

More Telugu News