: కస్టడీలో ఏం అడుగుతారు?... 'బాస్' ఎవరన్నది రేవంత్ వెల్లడిస్తాడా?


టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలివ్వడం తెలిసిందే. ఆ నాలుగు రోజుల కస్టడీలో ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని ఏమేం ప్రశ్నలు అడుగుతారన్న విషయమై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మొత్తం మీద, రేవంత్ ను ఏసీబీ ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందని అందరూ భావిస్తున్నారు. ప్రధానంగా, వీడియో క్లిప్పింగ్స్ లో పేర్కొన్న 'బాస్' ఎవరన్న దానిపై గుచ్చిగుచ్చి అడిగే అవకాశాలున్నాయి. స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు కాకుండా, మిగిలిన రూ.4.5 కోట్లు ఎక్కడ ఉన్నాయి? ఆ నగదు ఎక్కడి నుంచి తెచ్చారు? ఎవరు ఇచ్చారు? అన్న విషయాలపై రేవంత్ ను ప్రశ్నించేందుకు ఏసీబీ అధికారులు సమాయత్తమవుతున్నారు.

  • Loading...

More Telugu News