: తెలంగాణ ఐసెట్ లో కృష్ణాజిల్లా యువకుడికి ప్రథమ ర్యాంక్


తెలంగాణ ఐసెట్ (ఎం.బి.ఎ, ఎం.సి.ఎ కోర్సులలోకి ప్రవేశ పరీక్ష) ఫలితాల్లో కృష్ణా జిల్లాకు చెందిన కొల్లు కృష్ణ చైతన్య తొలి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. 200 మార్కులకు గాను 178 మార్కులు సాధించాడు. హైదరాబాద్ కు చెందిన ఎన్.ఏ.చంద్ర 168 మార్కులతో రెండో ర్యాంకును, రంగారెడ్డి జిల్లాకు చెందిన పి.రాఘవేంద్ర 160 మార్కులతో మూడో ర్యాంకును సాధించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఈ మధ్యాహ్నం తెలంగాణ ఐసెట్, లాసెట్ ఫలితాలను వరంగల్ లో విడుదల చేశారు.

  • Loading...

More Telugu News