: భారీగా తగ్గనున్న బంగారం ధరలు!


ప్రపంచ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నట్టుగా అమెరికాలో వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం వెలువడిన పక్షంలో బంగారం ధరలు గణనీయంగా పడిపోతాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ వెల్లడించింది. వడ్డీ రేట్లు పెరిగితే, ఇండియాలో పది గ్రాముల బంగారం ధర రూ. 20,500 నుంచి రూ. 24 వేల మధ్యకు పడిపోతుందని అంచనా వేసింది. కనీసం 10 నుంచి 25 శాతం వరకూ ధరలు తగ్గే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 900 డాలర్ల నుంచి 1,050 డాలర్లకు తగ్గవచ్చని తెలియజేసింది. ఒకవేళ వడ్డీ రేట్లు మారకుంటే ఔన్సు బంగారం ధర 1,300 డాలర్ల నుంచి 1,350 డాలర్లకు, దేశవాళీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 29,500 నుంచి రూ. 30,500 నడుమకు చేరుతుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది.

  • Loading...

More Telugu News