: రేవంత్ నిర్దోషిగా బయటకు వస్తారు: ఏపీ డిప్యూటీ సీఎం


ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అంటున్నారు. రేవంత్ రెడ్డి అరెస్టు కాకముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెన్సేషనల్ న్యూస్ వింటారంటూ మీడియా సమావేశంలో పేర్కొనడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. ఈ కేసులో సూత్రధారి ఏపీ సీఎం చంద్రబాబేనని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొనడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు నామినేటెడ్ ఎమ్మెల్యేతో ఫోన్ లో మాట్లాడినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని నాయిని వ్యాఖ్యానించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News