: నేను బయటకు చెబితే మంత్రి నారాయణ బాధపడతారు: ఏపీ డిప్యూటీ సీఎం కేఈ వివాదాస్పద వ్యాఖ్య


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం 33 వేల ఎకరాల భూసేకరణ విజయవంతం కావడం వెనుక తన శాఖ ఘనతేనని ఆయన అన్నారు. ఈ విషయాన్ని బయటకు చెబితే మంత్రి నారాయణ బాధ పడతాడనే ఇంతకాలమూ వెల్లడించలేదని వివరించారు. భూ సేకరణ కోసం 50 మంది తహసీల్దార్లను, 50 మంది డిప్యూటీ తహసీల్దార్లను, 100 మంది సర్వేయర్లను కేటాయించామని ఆయన గుర్తు చేశారు. వీరంతా లేకుంటే భూ సేకరణ జరిగేదా? అని ఆయన ప్రశ్నించారు. కేఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మరోసారి విభేదాలు బయట పెట్టాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News