: రేవంత్ బెయిల్ పిటిషన్ పై కోర్టులో ప్రారంభమైన వాదనలు


టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైదరాబాదులోని ఏసీబీ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ఏసీబీ వేసిన కస్టడీ పిటిషన్ పై కూడా ఇవాళే విచారణ జరగనుంది. ఈ పిటిషన్లపై మధ్యాహ్నం 12 గంటలకు వాదనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో, రేవంత్ కు ఏసీబీ కోర్టు బెయిల్ ఇస్తుందా? లేక ఏసీబీ కస్టడీకి అప్పగిస్తుందా? అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. రేవంత్ ను కస్టడీకి అప్పగిస్తే, ఆయనను ప్రశ్నించడానికి ప్రశ్నావళిని కూడా ఏసీబీ రూపొందించింది. రేవంత్ నుంచి సరైన సమాధానం రాకపోతే, ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు తగిన ఆధారాలను కూడా సిద్ధం చేసుకుంది.

  • Loading...

More Telugu News