: 7 న వైకాపాలో చేరతా: బొత్స
పార్టీ మారే విషయమై విజయనగరం జిల్లా కాంగ్రెస్ బహిష్కృత నేత బొత్స సత్యనారాయణ నోరు విప్పారు. తాను 7వ తేదీ ఆదివారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా వైకాపాలో చేరనున్నారని తెలిపారు. అనుచరులతో అన్ని విషయాలూ చర్చించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నానని బొత్స తెలియజేశారు. తాను వైకాపాను ఎటువంటి పదవులూ ఇవ్వాలని కోరలేదని ఆయన అన్నారు.