: తెలంగాణలో 'ఓ' కులాన్ని అణచివేసే ప్రయత్నం జరుగుతోంది: వేం నరేంద్రరెడ్డి
ఇటీవల జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేం నరేంద్రరెడ్డి టీఆర్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ బలమైన సామాజిక వర్గాన్ని అణచివేయాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళుతోందని ఆరోపించారు. రెడ్డి సామాజిక వర్గాన్ని అణచివేస్తున్నారన్న భావనతోనే ఆయన పైవ్యాఖ్యలు చేశారన్నది సుస్పష్టం. ఈ కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డిని అన్యాయంగా కేసులో ఇరికించారని చెప్పారు. రేవంత్ కేసుకు సంబంధించిన ఫుటేజ్ ను తమకు కావాల్సిన విధంగా మార్చి, కొందరు నేతలు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. టీఎస్ మంత్రి కేటీఆర్ దీని కోసం తన తెలివితేటలన్నీ ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా ఇదే తరహా ఆరోపణలు పలుమార్లు చేశారు.