: సైనా మళ్లీ 'పడిపోయింది'!
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నెంబర్ వన్ పీఠం మళ్లీ చేజారింది. వరల్డ్ నెంబర్ వన్ గా అవతరించి చరిత్ర సృష్టించిన తర్వాత సైనా ర్యాంకింగ్ ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతోంది. వరల్డ్ బ్యాడ్మింటన్ తాజా ర్యాంకుల్లో ఈ హైదరాబాదీ షట్లర్ మూడోస్థానానికి పడిపోయింది. మహిళల సింగిల్స్ విభాగంలో విడుదల చేసిన ఈ జాబితాలో చైనా తార, ఒలింపిక్ చాంపియన్ లి ఝురుయి అగ్రస్థానం అలంకరించింది. రెండో స్థానంలో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ నిలిచింది. కాగా, సైనా ఖాతాలో 79192 పాయింట్లు ఉండగా, ఝురుయి ఖాతాలో 85217, మారిన్ ఖాతాలో 80752 పాయింట్లు ఉన్నాయి. ఇక, పురుషుల విభాగంలో తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ మూడో స్థానానికి ఎగబాకాడు. మహిళల డబుల్స్ లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడీకి 17వ ర్యాంకు లభించింది.