: కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు
బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్ లో నేడు బంగారం 10 గ్రాముల ధర రూ.140 తగ్గి రూ.27,200 పలుకుతోంది. ఇక, వెండి కిలో ధర రూ.300 తగ్గి రూ.38,400 పలుకుతోంది. డిమాండు తగ్గడంతో ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. అంతేగాకుండా, నాణేల తయారీదారులు, ఇతర వర్గాలు కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో ధరలు తగ్గినట్టు అర్థమవుతోంది.