: మా పార్టీలో 30 లక్షల మంది ముస్లింలు చేరారు: బీజేపీ జాతీయ సెల్ చీఫ్
మిస్డ్ కాల్ ద్వారా పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపుకు అపూర్వ స్పందన వచ్చినట్టు ఆ పార్టీ జాతీయ మైనార్టీ సెల్ చీఫ్ అబ్దుల్ రషీద్ తెలిపారు. ఇటీవల నిర్వహించిన సభ్యత్వ నమోదులో ఏకంగా 30 లక్షల మంది ముస్లింలు బీజేపీ చేరినట్టు ఆయన లక్నోలో చెప్పారు. అంతేగాక గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అసోం, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో బీజేపీలో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్సారీ వివరించారు. "ప్రతిపక్షాల దాడులు కాదు... నా ప్రభుత్వ కార్యక్రమాలను చూసి నన్ను అంచనా వేయండి" అన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తికి ముస్లిం ప్రజానీకం నుంచి ఈ భారీ స్పందన వచ్చిందని పేర్కొన్నారు.