: జూనియర్ జట్లకు కోచ్ గా ద్రావిడ్?


సచిన్, గంగూలీ, లక్ష్మణ్ తో సలహా సంఘాన్ని ఏర్పాటు చేసిన బీసీసీఐ, మరో దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ను విస్మరించిందంటూ విమర్శకులు ధ్వజమెత్తడం తెలిసిందే. అటు, ద్రావిడ్ కు టీమిండియా కోచ్ బాధ్యతలు అప్పగిస్తారని, అందుకే సలహా సంఘంలో చోటు కల్పించలేదంటూ వార్తలు వచ్చాయి కూడా. అయితే, బీసీసీఐ వర్గాలు మరోలా భావిస్తున్నట్టు సమాచారం. ద్రావిడ్ కు భారత జూనియర్ క్రికెట్ కోచింగ్ బాధ్యతలు అప్పగించాలని బోర్డు భావిస్తోందట. భారత్ అండర్-19, భారత్-ఎ జట్లకు కోచ్ గా ద్రావిడే సరైన వ్యక్తి అని బోర్డు విశ్వసిస్తున్నట్టు తెలిసింది. దీనిపై బోర్డు అధికారులు ఎవరూ పెదవి విప్పడంలేదు. కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ... ద్రావిడ్ సేవలను ఎలా వినియోగించుకుంటామన్న విషయమై సమయం వచ్చినప్పుడు ప్రకటన చేస్తామని మాత్రం చెప్పారు.

  • Loading...

More Telugu News