: రాజధాని భూమిపూజకు ఈసీ అనుమతి కోరిన ఏపీ ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్ రాజధాని భూమి పూజకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాసింది. జూన్ 6 ఉదయం 8.49కి రాజధాని భూమి పూజకు ముహూర్తంగా నిర్ణయించామని తెలిపింది. ఈ క్రమంలో పూజ నిర్వహించేందుకు అనుమతి తెలపాలని ఈసీని కోరింది. అంతేగాక ఎన్నికలు జరిగే జిల్లాల్లో జన్మభూమిలో పాల్గొనవద్దని ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు ఆదేశాలిచ్చింది. జులై 3న స్థానిక కోటాలో జరగనున్న 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. దాంతో నిన్న (మంగళవారం) రాత్రి నుంచి ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి వచ్చింది.

  • Loading...

More Telugu News