: ‘మ్యాగీ’పై దేశవ్యాప్త నిషేధం... కేంద్రం ప్రకటనతో భారీగా పతనమైన నెస్లే షేరు


‘నెస్లే’ మ్యాగీ నూడిల్స్ పై కేంద్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. దేశవ్యాప్తంగా మ్యాగీ నూడిల్స్ అమ్మకాలను నిషేధించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కొద్దిసేపటి క్రితం అధికారిక ప్రకటన విడుదల చేశారు. మ్యాగీ నూడిల్స్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నామని చెప్పిన పాశ్వాన్, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. మ్యాగీ నూడిల్స్ లో హానికారక రసాయనాలున్నాయన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్, కేరళ ప్రభుత్వాలు వాటి అమ్మకాలను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాగీ నూడిల్స్ పరీక్షలు జరుపుతున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై దృష్టి సారించింది. ఈ క్రమంలో నెస్లేకు షాకిస్తూ కేంద్రం మ్యాగీ నూడిల్స్ విక్రయాలను దేశవ్యాప్తంగా నిషేధించింది. కేంద్రం నిర్ణయంతో ఈ రోజు స్టాక్ మార్కెట్లో నెస్లే షేరు భారీగా పతనమైంది.

  • Loading...

More Telugu News