: కత్తి లేకుండానే వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు దిట్ట: సమర దీక్షలో వైఎస్ జగన్


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సమర దీక్షలో ప్రారంభోపన్యాసం చేసిన జగన్, ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీల అమలును ప్రశ్నించారు. అధికారం దక్కించుకునేందుకు లెక్కకు మిక్కిలి హామీలు గుప్పించిన చంద్రబాబు, అధికారం చేతికందగానే వాటి అమలును గాలికొదిలేశారన్నారు. కత్తి లేకుండానే వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు దిట్ట అని ఆయన అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుపై ప్రజా బ్యాలెట్ నిర్వహించనున్నట్లు జగన్ ప్రకటించారు. దీక్షకు హాజరైన వారికి చంద్రబాబు ఇచ్చిన హామీల చిట్టా ఇచ్చి, అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ప్రజా బ్యాలెట్ లో చంద్రబాబు ఏడాది పాలనకు ఎన్ని మార్కులు వస్తాయో ఇట్టే తెలిసిపోతుందన్నారు. ప్రజా బ్యాలెట్ ఫలితాలను ప్రముఖంగా ప్రచురించాలని మీడియా సంస్థలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News