: ‘పీకే’ రికార్డుల పరంపర... చైనాలో రూ.86 కోట్ల వసూళ్లు రాబట్టిన హిందీ మూవీ!


బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన హిట్ చిత్రం ‘పీకే’ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా భారతీయ చలనచిత్ర రంగంలో రికార్డు నమోదు చేసిన ‘పీకే’, తాజాగా చైనాలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా రికార్డు దక్కించుకుంది. గత నెల 22న చైనాలో మొత్తం 500 థియేటర్లలో ‘పీకే’ రిలీజైంది. ఇప్పటిదాకా ఈ చిత్రం ఆ దేశంలో రూ.86 కోట్ల వసూళ్లను రాబట్టిందట. ఈ చిత్రానికి అమెరికా, కెనడాలో వచ్చిన వసూళ్ల కంటే చైనాలో వచ్చిన రాబడే అధికమట. 2009లో ఆమిర్ నటించిన ‘త్రి ఇడియట్స్’ చిత్రానికి కూడా చైనీయులు బ్రహ్మరథం పట్టారు.

  • Loading...

More Telugu News