: చంద్రబాబు ఎప్పటికీ ఆంధ్రాబాబే...తెలంగాణలో టీడీపీకి కాలం చెల్లినట్లే!: కడియం శ్రీహరి


తెలంగాణలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి కాలం చెల్లినట్లేనని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై వరంగల్ లో కొద్దిసేపటి క్రితం మాట్లాడిన కడియం, ఈ కేసులో ఏసీబీ అధికారులు పారదర్శకంగా వ్యవహరించారని తెలిపారు. చట్టానికి లోబడి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపైనా ఏసీబీ కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు. చంద్రబాబు ఎప్పటికైనా ఆంధ్రాబాబేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో మరో 10 రోజుల్లోగా తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కడియం ప్రకటించారు.

  • Loading...

More Telugu News