: బీసీసీఐ నిర్ణయాన్ని కొనియాడిన కోహ్లీ


బంగ్లాదేశ్ పర్యటనకు గాను టీమిండియా డైరక్టర్ గా రవిశాస్త్రిని కొనసాగిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించడం తెలిసిందే. శాస్త్రిని జట్టుతో ఉంచాలన్న బోర్డు నిర్ణయాన్ని టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనియాడాడు. శాస్త్రి జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడని పేర్కొన్నాడు. బాధ్యతల నుంచి తప్పుకునే వ్యక్తి కాదని, ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి అని కితాబిచ్చాడు. శాస్త్రి ముక్కుసూటిగా ఆలోచిస్తాడని, ఆటగాళ్లలో భరోసా నింపుతాడని తెలిపాడు. శాస్త్రి జట్టుతో పాటు ఉండడం అపార బలాన్ని చేకూర్చుతుందని అన్నాడు. ముఖ్యంగా, తన బ్యాటింగ్ మెరుగయ్యేందుకు శాస్త్రి ఇచ్చిన సలహాలు ఎంతగానో దోహదపడ్డాయని కోహ్లీ చెప్పాడు.

  • Loading...

More Telugu News