: పాక్ లో పలుచోట్ల ఉగ్రవాదులపై ఆర్మీ దాడి
ఉగ్రవాదులే లక్ష్యంగా పాక్ ఆర్మీ గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఉగ్రవాదులకు, ఆర్మీకి మధ్య కాల్పులు జరిగాయి. బెలూచిస్థాన్ ప్రావిన్స్ లో ఆర్మీ జరిపిన దాడుల్లో 14 మంది ఉగ్రవాదులు హతమవగా... ఇద్దరు పాక్ సైనిక అధికారులు మృత్యువాత పడ్డారు. మోర్గాన్ హరోబీ ప్రాంతంలో ఇరు వర్గాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు చనిపోగా... మరో రెండు ప్రాంతాల్లో ఐదుగుర్ని సైన్యం మట్టుబెట్టింది.