: సునంద పుష్కర్ కేసులో కీలక మలుపు
కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిన డాక్టర్ సుధీర్ గుప్తా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశారు. సునంద మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరిస్తూ నివేదిక ఇవ్వాలంటూ గతంలో తనపై ఒత్తిడి తీసుకొచ్చారని లేఖలో సుధీర్ గుప్తా పేర్కొన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్, గత ప్రభుత్వ పెద్దలు తనపై ఈ మేరకు ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఎయిమ్స్ డైరెక్టర్ ఖండించారు.