: కేసీఆర్ ది క్రిమినల్ మైండ్...రేవంత్ ను కావాలనే ఇరికించారు: ఏపీ హోంమంత్రి చినరాజప్ప


తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విరుచుకుపడ్డారు. కేసీఆర్ ది క్రిమినల్ మైండ్ అని చినరాజప్ప పేర్కొన్నారు. నేటి ఉదయం కాకినాడలో జరిగిన ఏపీ నవ నిర్మాణ దీక్షల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలను ఏం చేయడానికైనా కేసీఆర్ వెనుకాడటం లేదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిని కావాలనే కేసులో ఇరికించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వ్యవహారంతో తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News