: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కేసు డెయిరీ తెప్పించండి... కేంద్రానికి హైకోర్టు నోటీసు
టీఆర్ఎస్ కు చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నిక విషయంలో హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఆయనపై దుబాయ్ లో ఉన్న క్రిమినల్, సివిల్ కేసుల వివరాలు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనలేదని పిటిషనర్ సత్యంరెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో దుబాయ్ నుంచి కేసు డెయిరీలు తెప్పించి హైకోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. జీవన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిిటిషన్ పై కోర్టు నేడు విచారణ జరిపింది.