: టీడీపీ కృషి వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్: చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం మిలుగు బడ్జెట్ తో అలరారుతోందని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో చేపట్టిన నవ నిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడుతూ హైదరాబాదును ప్రపంచ పటంలో నిలిపింది తామేనని పేర్కొన్నారు. గతంలో తన తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టానన్నారు. నాటి తన సంస్కరణల కారణంగానే తెలంగాణకు మిగులు బడ్జెట్ అందిందన్నారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగాలని కోరామన్నారు. అయితే ఏపీ ప్రజల సమస్యలను ఆలకించకుండానే విభజనను పూర్తి చేశారన్నారు. విభజనపై కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.