: నా పాత్ర ఏమిటో ఇంకా తెలియదు: గంగూలీ
బీసీసీఐ సలహా కమిటీలోకి ఎంపికైన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడాడు. కొత్తగా ఏర్పాటు చేసిన సలహా కమిటీలో తన పాత్ర ఏమిటో ఇంకా తెలియదని అన్నాడు. సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లతో కలిసి పనిచేయనుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. "సలహా కమిటీలో స్థానం లభించిందని ఇప్పుడే తెలిసింది. మిగతా వివరాలేవీ తెలియదు. అసలు, క్రికెట్ వ్యవహారాల్లో సలహా సంఘం పాత్ర ఏమిటన్నది కూడా తెలియదు" అని మీడియాతో పేర్కొన్నాడు. సచిన్, లక్ష్మణ్, గంగూలీలను సలహా కమిటీ సభ్యులుగా ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించడం తెలిసిందే.