: రేవంత్ బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా


టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని ఏసీబీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరడంతో విచారణను కోర్టు వాయిదా వేసింది. తాను గత కొంతకాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులపై పోరాడుతున్నానని... అందువల్లే తనను కావాలనే ట్రాప్ చేసి, ఈ కేసులో ఇరికించారని బెయిల్ పిటిషన్ లో రేవంత్ పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనకు బెయిల్ మంజూరు చేయాలని విన్నవించారు.

  • Loading...

More Telugu News