: కేరళను తాకని రుతుపవనాలు... ఇంకొన్ని రోజులు ఎండలే!


వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసినట్టు నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకే అవకాశాలు కనిపించడం లేదు. మరో మూడు రోజుల తరువాత, 4వ తేదీన మాత్రమే రుతుపవనాలు భారత్ ను తాకవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రుతుపవనాలు విస్తరించేందుకు ప్రస్తుతానికి ఎటువంటి అవకాశాలూ కనిపించడం లేదని ఐఎండీ అధికారి డీఎస్ పాయ్ వివరించారు. అంతకుముందు మే 30 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేసిన సంగతి తెలిసిందే. అరేబియా సముద్రంలో తుపానులు ఏర్పడే అవకాశాలు లేనందునే శీతలగాలుల పయనం నిలిచిపోయిందని తెలిపారు. కాగా, రుతుపవనాల ఆలస్యం కారణంగా మరో మూడు నాలుగు రోజులు ఎండల తీవ్రత కొనసాగనుంది. ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News