: రేవంత్ కేసులో ఏ-2గా చంద్రబాబు?


రేవంత్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో రెండో నిందితుడిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పేరు ఉండవచ్చని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే కొనుగోలు బేరం వ్యవహారం చంద్రబాబు మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుందని ఒకసారి, బాస్ మీకు కృతజ్ఞతలు చెప్పమన్నారని మరోసారి, చంద్రబాబును మీరోసారి కలవాలని, తానే దగ్గరుండి తీసుకెళ్తానని ఇంకోసారి రేవంత్ తన నోటిగుండానే చెప్పినట్టు వీడియోలో కనిపిస్తున్న నేపథ్యంలో బాబును ఏ-2గా చార్జ్‌ షీట్లో చేర్చే అవకాశం ఉందని ఏసీబీ మాజీ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. డబ్బులు ఇచ్చే సమయంలోనూ, పట్టుబడ్డ సమయంలోనూ వాటిని ఎవరు పంపారు? సమకూర్చింది ఎవరు? కుట్రకు కారణం ఎవరు? తదితర అంశాలపైనా నిశిత పరిశీలన ఉంటుందని వారు చెప్పారు. కుట్రకు ప్రోత్సహించిన వారిని నిందితుల్లో చేర్చే అధికారం ఏసీబీకి ఉందని వారు స్పష్టంచేశారు. రేవంత్ వీడియో ఫుటేజ్‌ లో బాబు ప్రస్తావనపై స్పష్టమైన ఆధారాలు ఉండటంతో, స్టేట్‌మెంట్ కోసం నోటీసులు మాత్రం ఇచ్చే అవకాశం ఉందని సీనియర్ క్రిమినల్ లాయర్స్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News