: పక్కా ఆధారాలతోనే రేవంత్ ను అదుపులోకి తీసుకున్నాం: ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ వెల్లడి


తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన కేసులో పక్కా సాక్ష్యాలున్నాయని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఏకే ఖాన్‌ వెల్లడించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు రెండు రోజుల క్రితమే నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ నుంచి ఫిర్యాదు అందిందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కొందరు ప్రలోభపెడుతున్నారని, మధ్యవర్తులు డబ్బు ఆఫర్‌ చేస్తున్నారని స్టీఫెన్‌ సన్‌ ఫిర్యాదు చేసినట్టు ఖాన్‌ వివరించారు. ఆయననిచ్చిన ఫిర్యాదులో వాస్తవాలను తెలుసుకున్నామని, ఏసీబీ సిటీ డీఎస్పీ (రేంజ్‌ 1)తో ప్రాథమిక విచారణ జరిపించిన తరువాత సాక్ష్యాలు ఉన్నాయని నిర్ధారించుకుని ముందడుగు వేశామని తెలిపారు. దానిపై కేసు రిజిస్టర్‌ చేసుకున్న తరువాత డబ్బిచ్చేందుకు రేవంత్‌ వస్తున్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసినట్టు వివరించారు. రూ. 50 లక్షల నగదు తీసుకుని, ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డితో పాటు డబ్బులు ఇవ్వడానికి వచ్చిన బిషప్‌ సెబాస్టియన్‌ హ్యారీ, ఉదయ్‌ లను కూడా అదుపులోకి తీసుకున్నామని వివరించారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఇంటరాగేట్‌ చేస్తున్నామని, మరో నిందితుడు మథ్యాస్‌ జెరూసలేంను అరెస్ట్ చేయాల్సి వుందని తెలిపారు.

  • Loading...

More Telugu News