: రేవంత్ రెడ్డిని చంపే ప్రయత్నం జరుగుతోంది: ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు
తమ సహచర ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చంపే ప్రయత్నం జరుగుతోందని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంటనే టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణలు చెప్పి, రేవంత్ ను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ కు ఏదైనా జరిగితే కేసీఆరే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. డీజీపీ అనురాగ్ శర్మతో టీటీడీపీ నేతలు సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులంతా తెలంగాణ ద్రోహులే అని ఆరోపించారు.