: ఎల్ఓసీ వద్ద ఉగ్రవాదులు, సైనికులు హోరాహోరీ


లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) వద్ద ఉగ్రవాదులు, భారత సైనికుల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్థాన్ సరిహద్దుల నుంచి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు తీవ్రవాదులు ప్రయత్నించారు. దీంతో సరిహద్దుల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని తగ్ధార్ సెక్టార్ వద్ద భారీ ఆయుధ సామగ్రి కలిగిన ఉగ్రవాదుల బృందం ఎల్ వోసీ దాటి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. వీరి ప్రయత్నాన్ని గుర్తించిన భారత సైన్యం హెచ్చరికలు చేసింది. హెచ్చరికలు వింటూనే పాక్ ముష్కరులు రెచ్చిపోయారు. సైన్యంపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం దీటుగా సమాధానం ఇస్తోంది. ఇంకా కాల్పులు జరుగుతున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News