: టీడీపీ కార్యదర్శి మృతి కేసులో ఆ మహిళను విచారించండి: బొండా ఉమ


ఈ నెల 25న విజయవాడలోని మారుతీ నగర్ లో మృతి చెందిన విజయవాడ అర్బన్ టీడీపీ కార్యదర్శి పడాల కన్న మృతి ఘటనలో ఓ మహిళపై అనుమానం ఉందని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ ఆరోపణలు చేశారు. అందరితో కలివిడిగా ఉన్న కన్న ఆరోగ్యవంతుడని ఆయన తెలిపారు. అలాంటి వ్యక్తి వడదెబ్బ లేక హార్ట్ ఎటాక్ తో ఎలా చనిపోతాడనే అనుమానం పట్టి పీడిస్తోందని ఆయన అన్నారు. గతంలో విజయవాడ టీడీపీ అర్బన్ ఉపాధ్యక్షుడు ఉమ్మడి శ్రీనివాస్ మృతి కేసులో కూడా అదే మహిళపై అనుమానం ఉందని ఆయన చెప్పారు. కల్యాణి అనే మహిళ వీరిద్దరినీ ఆస్తి కోసం హత్య చేసి ఉంటుందని బొండా ఉమ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పడాల కన్న పోస్టు మార్టం రిపోర్టులో విషం లేదా సైనేడ్ ఇచ్చి హత్య చేసినట్టు తేలింది. దీంతో ఆమెపై అనుమానాలు బలపడుతున్నాయి.

  • Loading...

More Telugu News