: 'ఎటాక్' మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన రాంగోపాల్ వర్మ


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కొత్త సినిమా పోస్టర్ ను సామాజిక మాధ్యమం ద్వారా రిలీజ్ చేశాడు. వర్మ ఈ మధ్య కాలంలో విరివిగా సినిమాలు తీస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. '365 డేస్' సినిమాని ఈ మధ్యే విడుదల చేసిన వర్మ, కొత్త సినిమాకు ప్లాన్ వేశాడు. ఈ సినిమా మోషన్ పోస్టర్ లో మంచు మనోజ్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ లు కనిపిస్తున్నారు. సినిమా పేరు 'ఎటాక్'గా వర్మ పేర్కొన్నాడు. రేపు సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ లాంచ్ చేస్తామని వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. పోస్టర్ లో వర్మ పాత సినిమా 'రక్తచరిత్ర' వాసనలు వుండడం విశేషం.

  • Loading...

More Telugu News