: కేసీఆర్ తో భేటీ అయిన కూకట్ పల్లి టీడీపీ ఎమ్మెల్యే
తెలంగాణ శాసనమండలి ఎన్నికల ముందు టీడీపీకి మరో షాక్ తగిలింది. హైదరాబాదులోని కూకట్ పల్లి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి రానున్నారని ఇంతకు ముందే కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో, వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలో, 'తాను టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నా'నని మాధవరం చెప్పడం నామమాత్రమే అని తెలుస్తోంది.