: మహిళలు జీన్స్ వేసుకోవడం వల్లే భూకంపాలు: పాక్ ముస్లిం నేత


బోడి గుండుకి మోకాలికి ముడిపెట్టడంలో మత పెద్దలు సిద్ధహస్తులు...అందులోనూ పాకిస్థాన్ కి చెందిన మత పెద్దలైతే మహిళల్ని పిల్లలు కనే యంత్రాలుగా మాత్రమే పరిగణిస్తారు. అందుకే చిత్రవిచిత్రమైన ఫత్వాలు కూడా జారీ చేస్తుంటారు. తాజాగా పాకిస్థాన్ ముస్లిం మత పెద్ద, ఉగ్రవాద నాయకుడు జమైత్ ఉలేమా ఎ ఇస్లామీ ఫజల్ అధినేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ఇస్లామాబాద్ లోని ఓ హోటల్ లో మీడియాతో మాట్లాడుతూ, మహిళలు జీన్సు ప్యాంట్లు వేసుకోవడం వల్లే ద్రవ్యోల్బణం దగ్గర నుంచి భూకంపాల వరకు వస్తున్నాయని అన్నారు. పాకిస్థాన్ వ్యాప్తంగా జీన్సు ప్యాంట్లు వేసుకునే మహిళలపై సైనిక ఆపరేషన్ ప్రారంభించాలని కూడా ఆయన పనిలో పనిగా కోరారు. అలాగే, తాలిబన్లు పాకిస్థాన్ కు శత్రువులు కారని, అందువల్ల తెహరీక్ ఎ తాలిబన్ ఉగ్రవాద సంస్థ మీద పాకిస్థాన్ సైనిక ఆపరేషన్ చేయకూడదని ఆయన సెలవిచ్చారు.

  • Loading...

More Telugu News