: అదిరిపోయే 'బాహుబలి' టీజర్ తో రాజమౌళి రెడీ
'బాహుబలి' సినిమా ఆడియో వేడుకను వాయిదా వేసి అభిమానులను నిరాశకు గురి చేసిన రాజమౌళి, టీజర్ తో వారిని ఖుషీ చేయనున్నారు. ఈ సినిమా టీజర్ నేటి రాత్రికి విడుదల చేయనున్నట్టు రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా, టీజర్ అదిరిపోయిందని, 'బాహుబలి' చరిత్ర సృష్టించడం ఖాయమని దానిని ఇప్పటికే చూసిన వారు చెబుతున్నారు. బాలీవుడ్ దర్శకుడు, ఈ సినిమా హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూటర్ కరణ్ జోహర్ సినిమాపై ట్విట్టర్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఎక్కడలేని హైప్ తీసుకొస్తున్నారు.