: చంద్రబాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోండి: టీ అడ్వొకేట్ జేఏసీ ఫిర్యాదు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మహానాడు వేదికపై చంద్రబాబు ప్రసంగిస్తూ, ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చారని ఫిర్యాదులో ఆరోపించారు. 1951 చట్టం ప్రకారం ప్రజాప్రతినిధులను చంద్రబాబు అవమానపరిచారని... ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.