: యాదాద్రి అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
యాదాద్రిని తిరుపతి స్థాయిలో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట ఆలయంలో పునర్మిర్మాణ శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం యాదాద్రిగుట్ట వద్ద ఆలయ రాజగోపురం, మహా ప్రాకారం పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలన్నింటిలో గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి, చినజీయర్ స్వామిలు పాల్గొన్నారు. వారితో పాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. శంకుస్థాపన పనుల తరువాత గవర్నర్ దంపతులు, సీఎం, చిజీయర్ స్వామి యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.