: హైదరాబాద్ లో ఈఎస్ఐ కంటే విజయవాడలో మెరుగైన ఆసుపత్రి: వెంకయ్య
హైదరాబాద్ లో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రి కంటే మెరుగైన ఆసుపత్రిని విజయవాడలో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈఎస్ఐ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి కంటే మెరుగ్గా ఉండాలని సూచించారు. మరో మంత్రి బండారు దత్తాత్రేయతో కలసి వెంకయ్య ఈరోజు విజయవాడలో కార్మిక రాజ్య భీమా సంస్థ ఉప ప్రాంతీయ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. తరువాత ఈఎస్ఐ ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో కార్మిక శాఖ కీలకమైందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని ప్రావిడెండ్ ఫండ్ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని, రాష్ట్రంలో కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామని దత్తాత్రేయ చెప్పారు.