: నేపాల్ లో కొనసాగుతున్న భూప్రకంపనలు
గత నెలలో భారీ భూకంపం సంభవించిన తరువాత కూడా నేపాల్ లో భూప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ తెల్లవారు జామున 1.55 గంటలకు నేపాల్ లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై వాటి తీవ్రత 4 పాయింట్లుగా నమోదైందని ఖాట్మండులోని జాతీయ సీస్మలాజికల్ కేంద్రం తెలిపింది. దాంతో ఏప్రిల్ 25 తరువాత నేపాల్ లో సుమారు 291 సార్లు ప్రకంపనలు వచ్చాయని వెల్లడించింది.