: టీ.కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విప్ జారీ


తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 22 మంది పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. పార్టీ అభ్యర్థి ఆకుల లలితకు ఓటు వేయాలని అందులో పేర్కొంది. పార్టీ గుర్తుపై మొత్తం 21మంది ఎమ్మెల్యేలు గెలవగా, దొంతి మాధవరెడ్డి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వారిలో విఠల్ రెడ్డి, కోరం కనకయ్య, రెడ్యా నాయక్, కె.యాదయ్యలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. అయినా ఆ నలుగురికి కూడా విప్ జారీ చేశారు. జూన్ 1న రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఓపెన్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతుండటంతో ఎమ్మెల్యేలంతా ఎవరు ఏ పార్టీకి ఓటు వేసింది తెలియనుంది.

  • Loading...

More Telugu News