: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఒడిశా మాజీ సీఎం


ఒడిశాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపినట్లు గమాంగ్ వెల్లడించారు. కాగా, ఆయన బీజేపీ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. 2014 పార్లమెంటు ఎన్నికల్లో కోరాపుట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఆ తరువాత కాంగ్రెస్ తనను పక్కన పెట్టడంపై గుర్రుగా ఉన్న గమాంగ్, తన భవిష్యత్ ప్రణాళికలను కార్యకర్తలతో చర్చించి చెబుతానని వివరించారు. రెండు వారాల క్రితమే ఆయన రాజీనామాపై వార్తలు వెలువడ్డాయి. గిరిధర్ గమాంగ్ కుమారుడు శిశిర్ గమాంగ్, తన తండ్రి కాంగ్రెస్ కు రాజీనామా చేసి మరో జాతీయ పార్టీలో చేరతారని తెలిపారు.

  • Loading...

More Telugu News