: రామమందిరానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు: రాజ్ నాథ్ సింగ్


అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి విషయాలపై తామిప్పుడు దృష్టి పెట్టడం లేదని, ప్రస్తుతానికి అభివృద్ధే తమ లక్ష్యమని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ రెండు విషయాలూ ముఖ్యమైనవే అన్న ఆయన, ఇప్పటికిప్పుడు వీటికి పరిష్కారం లభించే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. లోక్ సభలో 370 సీట్లు గెలిస్తే తమ ప్రధాన అజెండాను అమలు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, రాజ్ నాథ్ ఇలా స్పందించారు. రామమందిరం విషయం చట్ట పరిధిలో ఉందని, హైకోర్టు రూలింగుపై చేసిన అపీలు సుప్రీంలో విచారణ దశలో ఉందని, తాము తీర్పు కోసం వేచి చూస్తున్నామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News