: ఆ టెన్నిస్ స్టార్ ముద్దులు విసురుతుంటే, ఈ ఫుట్ బాల్ స్టార్ క్యాచ్ పడుతున్నాడు!
టెన్నిస్ అంటే అంతగా ఇష్టం లేకపోయినా, ఈ ఫుట్ బాల్ స్టార్ ఫ్రెంచ్ ఓపెన్ పోటీలకు హాజరవుతూ తన ప్రియురాలు విసురుతున్న ముద్దులను ఒడిసిపడుతున్నాడు. జర్మనీకి చెందిన ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు, గత సంవత్సరం వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ముఖ్య ఆటగాడు అయిన బాస్టియన్ ష్వీన్ స్టీగర్, సెర్బియా టెన్నిస్ క్రీడాకారిణి అనా ఇవనోవిచ్ లేటెస్టుగా ప్రేమపక్షులై చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అందుకే ఆమె ఆడుతున్న పోటీలను స్వయంగా దగ్గరుండి తిలకిస్తూ, ప్రోత్సహించేందుకు బాస్టియన్ మైదానాలకు వస్తున్నాడు. ఆమె కోర్టునుంచి అతనికి ముద్దులిస్తుంటే, ఈయన క్యాచ్ పడుతున్నాడు. ఈ ఫోటోలను ప్రపంచవ్యాప్తంగా అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. అన్నట్టు వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నట్టు కూడా వార్తలు వెలువడ్డాయి.