: చిరకాల వాంఛ నెరవేరుతోంది: సోనాక్షీ సిన్హా
త్వరలోనే చిరకాల వాంఛ నెరవేరబోతోందని బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తెలిపింది. లైవ్ లో వేలాది మంది అభిమానుల సమక్షంలో రాక్ స్టార్ లా పాటలు పాడుతూ ఉర్రూతలూగించాలని కలలు కంటూ ఉంటానని సోనాక్షి చెప్పింది. అయితే ఇంత వరకు ఆ అవకాశం దక్కలేదన్న సోనాక్షి ఐఐఎఫ్ఏ అవార్డుల కార్యక్రమంలో తన కలనెరవేరబోతోందని చెప్పింది. జూన్ లో మూడు రోజుల పాటు జరుగనున్న అంతర్జాతీయ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డుల కార్యక్రమంలో పాట పాడనున్నానని, అందుకు అంతా సిద్ధం చేసుకున్నానని, దానికోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని సోనాక్షి తెలిపింది.